
గాంధారి మండలంలోని బ్రాహ్మణపల్లి గ్రామంలో రిలయన్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పశుపోషణ యాజమాన్య పద్ధతులపై పాడి రైతులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా మేలు జాతి పశువుల ఎంపిక మరియు గడ్డి జాతులపై అలాగే కుడి జాతులకు సంబంధించి చర్చించడం జరిగింది. అలాగే రిలయన్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పాడి రైతులకు మినరల్ మిక్చర్ మరియు గొర్రెలు మేకలు కలిగిన వారికి బ్రిక్స్ ఇవ్వడం జరిగింది.ఈ కార్యక్రమంలో రిలయన్స్ ఫౌండేషన్ ప్రతినిధి ప్రసాద్ మరియు సతీష్ మరియు వార్డ్ మెంబర్ సాయిలు డైరెక్టర్ పోచయ్య గోపలమిత్ర రమేష్ మరియు రైతులు పాల్గొనడం జరిగింది.