మండలంలోని చౌట్ పల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో శుక్రవారం వైద్య సిబ్బందికి, ఆశ కార్యకర్తలకు వయోజన బీసీజీ టీకాపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా శిక్షణకు హాజరైన డాక్టర్ సంతోష్ మాట్లాడుతూ ఇప్పటివరకు చిన్న పిల్లలకు ఈ టీకా ఇచ్చేవారని, 2025 సంవత్సరం వరకు టిబి ని నిర్ములించడంమే లక్ష్యం దిశగా ముందుకు వెళ్తున్నాము కాబట్టి పెద్దలకు కూడా బీసీజీ వ్యాక్సిన్ ఆగస్ట్ లో ఇవ్వబోతున్నామని తెలిపారు. ముందుగా క్షయ వ్యాధిగ్రస్థుల ఇంటిలో నివసిస్తున్న వారికి, 60సంవత్సరాలు ఇంపాక్ట్ వారికి, పొగత్రాగే వారికి, డయాబేటిక్ తో బాధ పడుతున్న వారికి, పోషకాహర లోపం వారికి ఈ వాక్సిన్ ఇస్తున్నామని తెలిపారు.ఈ కార్యక్రమంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యురాలు డాక్టర్ సుప్రియ, ఆరోగ్య విస్తీర్ణ అధికారి సత్యనారాయణ, జిల్లా టిబి కోఆర్డినేటర్ రవిగౌడ్, ఎం ఎల్ హెచ్ పి, ఏఎన్ఎం లు, ఆశా కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.