డిచ్ పల్లి మండల కేంద్రంలోని ఘన్పూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని మానవతా సదన్ లో మండలంలోని డిచ్ పల్లి, రాంపూర్, నడిపల్లి సెక్టార్ కీ చెందిన అంగన్వాడీ టీచర్స్, ఏ యన్ యం, ఆశాలకు సూపర్ వైజరీ సప్లి మెంటరీ ఫీడింగ్ ప్రోగ్రాం పైన శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డిచ్ పల్లి ప్రాజెక్ట్ సి డి పి వో స్వర్ణలత పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సూపర్ వైజర్ లు మమతా, బుజ్జి, భాగ్య లక్ష్మీ ఆర్ బి యస్ కె డాక్టర్స్ తహిమినా ఫాతిమా శివ ప్రసాద్ ,పోషణ్ అభియాన్ కో ఆర్డినేటర్ యన్ రాంబాబు, ఐటీ కో ఆర్డినేటర్ రంజిత్ పాల్గొని అయా విషయాలపై శిక్షణ అందజేశారు.