– ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
అసిఫాబాద్ జిల్లా ఎస్పీని వెంటనే బదిలీ చేయాలని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు గురువారం హైదరాబాద్‌లో ఎన్నికలసంఘం ప్రధాన అధికారి వికాస్‌రాజుకు వినతి పత్రం అందజేశారు. అధికార పార్టీ ఎమ్మెల్యే కోనేరు కోనప్పకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.జిల్లా ఎస్పీ కె సురేష్ కుమార్ ఎన్నికల నియమ నిబంధనలను దుర్వినియోగం చేస్తున్నారని పేర్కొన్నారు. మద్యం,డబ్బు పంపిణీపై ఎన్నికల సంఘం పకడ్బందీగా చర్యలు తీసుకోవాలని కోరారు.