
అవకతవకపై ప్రశ్నిస్తే బదిలీ చేశారని రూట్ సూపర్వైజర్ కానుగు రాజీవ్ గౌడ్ ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం, యాదగిరిగుట్ట మండలం వంగపల్లి మదర్ డైరీ మిల్క్ చిల్లింగ్ సెంటర్, కానుగు రాజీవ్ గౌడ్ మాట్లాడుతూ నల్లగొండ రంగారెడ్డి మదర్ డైరీ వంగపల్లి చిల్లింగ్ సెంటర్లో గత ఎనిమిది సంవత్సరాలుగా విధులు నిర్వహిస్తున్నాను అన్నారు. చిల్లింగ్ సెంటర్ మేనేజర్ సత్యనారాయణ తో చిల్లింగ్ సెంటర్లో జరుగుతున్న అవకతవకపై ప్రశ్నించానని, వంగపల్లి పరిధిలో 23 గ్రామాల నుండి పాలు తీసుకొస్తాము. ప్రతి సొసైటీ కి ఐదు పాయింట్లు చొప్పున ఫ్యాట్ కట్ చేసి సొసైటీలకు ఎందుకు తక్కువగా వేస్తున్నావు అని మేనేజర్ ని ప్రశ్నించనని, ఆ మేనేజరు దూషణలు చేసి నా ఇష్టం ఉన్నట్లు చేస్తా నీకు నచ్చిన దగ్గర చెప్పుకో అని బెదిరించారని తెలిపారు. ప్రతి సొసైటీకి ఐదు పాయింట్ల ఫ్యాట్ కట్ చేసి, మహబూబ్ పేట సెంటర్కు రోజు పది పాయింట్లు ఫ్యాట్ కలపడం జరుగుతుందని అన్నారు. స్థానిక డైరెక్టర్ కందాల అలివేలు భర్త రంగారెడ్డి తో కలిసి మేనేజర్ నన్ను బదిలీ చేశారని అన్నారు.