ప్రభుత్వ ఉద్యోగికి బదిలీ సహజం..

Transfer is natural for govt employee..నవతెలంగాణ – నూతనకల్
ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగికి బదిలీ సహజమని ప్రాథమికోన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు   సోమయ్య అన్నారు. సోమవారం మండల పరిధిలోని చిల్పకుంట్ల ప్రాథమికోన్నత పాఠశాలలో ఇటీవల బదిలీపై వెళ్లిన ఉపాధ్యాయు, ఉపాధ్యాయరాలకు శాల్వాలతో సన్మానం చేసి పుష్ప గుచ్చం ఇచ్చి వీడుకోలు  తెలిపారు అనంతరం ఆయన మాట్లాడుతూ వృత్తిని నిబద్ధతితో పని చేస్తే గుర్తింపు లభిస్తుందని అన్నారు. సమాజ నిర్మాణం జరిగేది పాఠశాలలోనే కాబట్టి విద్యార్థులకు విద్య తో పాటు నైతిక విలువలు కూడా ప్రతి ఉపాధ్యాయుడు నేర్పాలని సూచించారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు ఎండి అజీమోద్దీన్, జలగం క్రాంతి ప్రభ, పద్మావతి ఎం నాగన్న బి శ్రావణ్ కుమార్, పాఠశాల సిబ్బంది, అంగన్వాడి సిబ్బంది అన్నపూర్ణ సోమలక్ష్మి విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.