150 మంది జెడ్పీ సీఈఓ, డిప్యూటీ సీఈఓ, డీపీఓల బదిలీ

150 ZP CEO Transfer of Deputy CEO and DPOనవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
రాష్ట్రంలో అధికారుల బదిలీల పరంపర కొనసాగుతున్నది. తాజాగా పంచాయతీరాజ్‌ శాఖలోని 105 మంది జెడ్పీ సీఈఓలు, డిప్యూటీ సీఈఓలు, డీపీఓలను రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు సోమవారం పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ ప్రధాన కార్యదర్శి సందీప్‌కుమార్‌ సుల్తానియా ఉత్తర్వులు జారీ చేశారు. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో సొంత జిల్లాలతో పాటు మూడేండ్ల నుంచి ఒకే చోట పనిచేస్తున్న అధికారులను బదిలీ చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఈ బదిలీలు జరిగాయి. ఇప్పటికే రాష్ట్రంలో 395 మంది ఎంపీడీఓలు బదిలీ అయిన విషయం తెలిసిందే.