– ఒకే జిల్లా, మూడేండ్ల ప్రాతిపదికన స్థానచలనం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలో పెద్ద సంఖ్యంలో ఎంపీడీవోలను ప్రభుత్వం బదిలీ చేసింది. ఒకే సారీ 395 మందికి స్థాన చలనం కలిగించింది. ఈ మేరకు పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ అనితా రామచంద్రన్ సర్య్కూలర్ జారీ చేశారు. జిల్లా కలెక్టర్లు బదిలీ అయిన ఎంపీడీవోలను ఈ నెల 12న రిలీవ్ చేసి, 13న కొత్తవారు బాధ్యతలు చేపట్టేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. 2024 లోకసభ సాధారణ ఎన్నికలను పురస్కరించుకుని సొంత జిల్లాలో పనిచేస్తున్న వారితో పాటు, మూడేండ్లుగా ఒకే చోట విధులు నిర్వహిస్తున్న వారిని బదిలీ చేయాలని గత డిసెంబర్‌లో కేంద్ర ఎన్నికల సంఘం అన్ని రాష్ట్రాలను ఆదేశించింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో బదిలీల పరంపర కొనసాగుతోంది. మరో రెండు, మూడు రోజుల్లో రాష్ట్రంలో ఇతర శాఖల్లో సైతం ఎన్నికల నియమాళి ప్రకారం భారీ సంఖ్యలో బదిలీలు జరగుతాయిని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.