ఆర్మూర్ రెవెన్యూ డివిజనల్ అధికారి బదిలీ

నవతెలంగాణ ఆర్మూర్
రెవెన్యూ డివిజనల్ అధికారి శ్రీనివాసులు బదిలీ అయ్యారు..2018 సంవత్సరం సెప్టెంబర్ 5వ తేదీన ఆర్మూర్ ఆర్డీవో గా పదవి బాధ్యతలు స్వీకరించిన శ్రీనివాసులు డివిజనల్ కు నిర్విరామ సేవలు అందించినారు. ఇక్కడకు రాకముందు నల్గొండ జిల్లాలోని దేవాదుల ప్రాజెక్టు భూసేకరణ అధికారిగా విధులు నిర్వహించినారు. శ్రీనివాసులకు ముందు పనిచేసిన ఆర్డీవో భలే శ్రీనివాస్ 2018 ఒకటవ నెలలో ఏసీబీకి పట్టుబడిన విషయం విధితమే.. ప్రస్తుత ఆర్డిఓ స్థానంలో కొత్త వారిని నియమిస్తారా? ఇంకెవరికైనా ఇంచార్జ్ బాధ్యతలు అప్పగిస్తారా ? ఉత్తర్వులు రావాల్సి ఉంది.