– నార్కోటిక్ డ్రగ్స్ విభాగం డైరెక్టర్‌గా కమలాసన్‌రెడ్డి
నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి
రాష్ట్రంలో ఐదుగురు ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర పోలీసు పర్సనల్ విభాగం ఐజీ కమలాసన్‌రెడ్డిని రాష్ట్ర నార్కోటిక్ కంట్రోల్ విభాగం డైరెక్టర్‌గా బాధ్యతలు అప్పగించారు. అలాగే, పోస్టింగ్ కోసం ఎదురు చూస్తున్న అదనపు డీజీ డాక్టర్ సౌమ్య మిశ్రాకు పోలీసు పర్సనల్ విభాగాన్ని అప్పగించారు. పోస్టింగ్ కోసం ఎదురు చూస్తున్న మరో డీఐజీ అంబర్ కిషోర్ ఝాను రాష్ట్ర హౌంగార్డ్స్ డైరెక్టర్‌గా నియమించారు. అలాగే, నగర అదనపు పోలీసు కమిషనర్ (క్రైమ్) ఎ.ఆర్ శ్రీనివాస్‌ను అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) డైరెక్టర్‌గా బదిలీ చేశారు. నగర నేర పరిశోధక విభాగం డీసీపీ శంబరీశ్‌ను మేడ్చల్ డీసీపీగా బదిలీ చేశారు.