నవతెలంగాణ – కంఠేశ్వర్
నిజామాబాదు పోలీస్ కమిషనరేట్ పరిధిలో వివిధ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న ఆరుగురు కానిస్టేబుళ్లను బదిలీ చేస్తున్నట్లు సిపి కల్మేశ్వర్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో ఆరో టౌన్ పోలీస్ స్టేషన్ నుంచి ముగ్గురు బదిలీ కాగా, సిరికొండ, ధర్పల్లి, త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ల నుండి ఒక్కొక్కరి చొప్పున బదిలీ అయ్యారు. వీరిని అడ్మినిస్ట్రేషన్ గ్రౌండ్స్ లో భాగంగా బదిలీలు చేయడం జరిగిందని సిపి ఉత్తర్వులో పేర్కొన్నారు.