ముగ్గురు ఐఏఎస్‌ల బదిలీ

– ఉత్తర్వులు జారీ సీఎస్‌ శాంతికుమారి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్ర ప్రభుత్వం ముగ్గురు సీనియర్‌ ఐఏఎస్‌ అధికారులను బదిలీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. పోస్టింగ్‌ కోసం ఎదురు చూస్తున్న డాక్టర్‌ యోగితా రాణాను విద్యాశాఖ కార్యదర్శిగా, మైన్స్‌ అండ్‌ జియాలజీ కార్యదర్శి కె. సురెంద్ర మోహన్‌ను రవాణాశాఖ కమిషనర్‌గా, ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి ఎన్‌.శ్రీధర్‌కు మైన్స్‌ అండ్‌ జియాలజీ కార్యదర్శిగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు. పరిపాలనా విధానంలో భాగంగానే ఈ బదిలీలు చేశామని ఉత్తర్వులో పేర్కొన్నారు.