తెలంగాణ యూనివర్సిటీ లో18 కోట్లతో నిర్మిస్తున్న సైన్స్ బిల్డింగ్ ను నాసిరకంగా కడుతున్నారని పి.డి.ఎస్.యూ జిల్లా ప్రధాన కార్యదర్శి జన్నారపు రాజేశ్వర్ ఆరోపించారు.సోమవారం యూనివర్సిటీ కమిటీ ఆధ్వర్యంలో సైన్స్ బిల్డింగ్ ను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా జన్నారపు రాజేశ్వర్ మాట్లాడుతూ గత 15 రోజుల కిందటే నూతనంగా నిర్మిస్తున్న తరగతి గదులలో పగుళ్లు ఏర్పడ్డాయని యూనివర్సిటీ అధికారులకు ఫిర్యాదు చేశామని అయినా కానీ ఇప్పటివరకు తరగతి గదులకు మరమత్తులు చేయలేదని , మొత్తం 8 రూములలో ప్లాస్టింగ్ పూర్తయి సున్నం వేసిన తర్వాత పగుళ్లు ఏర్పడ్డాయని బిల్డింగ్ కూలే పరిస్థితి ఏర్పడిందని, కోట్ల రూపాయలతో కట్టిన గదులలో పగుళ్లు ఏర్పడడం ఏంటని, నాసిరకం పనులపై వెంటనే కమిటీని ఏర్పాటు చేయాలని , పనులు మొత్తం నత్త నడకన నడుస్తూ నాసిరకంగా కడుతున్నారని, వెంటనే ప్రస్తుతం ఉన్న కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకొని వేరే కాంట్రాక్టర్ కి పనులు అప్పగించాలని డిమాండ్ చేశారు. లేనిచో ప్రస్తుతం జరుగుతున్న నాసిరకంగా పనులపై వైస్ ఛాన్సలర్ కు ,రాష్ట్ర ప్రభుత్వానికి పిర్యాదు చేస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో యూనివర్సిటి నాయకులు రవీందర్,అక్షయ్, హన్మండ్లు,మణికంఠ,సాయికృష్ణ,భా స్కర్,ప్రవీణ్, సాయి ప్రకాష్, శేఖర్ తదితదిరులు పాల్గొన్నారు .