నవతెలంగాణ – ఆర్మూర్
మున్సిపాలిటీలో రెవెన్యూ (ఆర్ ఓ) విభాగంలో విధులు నిర్వహించే జూనియర్ అసిస్టెంట్ ప్రసన్న కుమార్ పై అవినీతి ఆరోపణలురావడంతో పింఛన్ విభాగానికి బదిలీ చేసినట్లు మున్సిపల్ కమిషనర్ రాజు బుధవారం తెలిపారు. మున్సిపల్ కార్యాలయంలో బుధవారం విలేకరులతో ఆయన మాట్లాడారు. ఆర్వో విభాగంలో జూనియర్ అసిస్టెంట్ గా విధులు నిర్వహిస్తున్న ప్రసన్న కుమార్ పై ఆరోపణలు రావడంతో ఆ విభాగం నుంచి తొలగిస్తూ నోటీసు ఇచ్చామన్నారు. ఆర్ ఓ విభాగంలో మరొకరిని నియమిస్తామని చెప్పారు. మున్సిపల్ కార్యాలయంలో విధులు నిర్వహించే సిబ్బంది డబ్బులు డిమాండ్ చేస్తే చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.
విచారణ చేయిస్తాం..అదనపు కలెక్టర్ అంకిత్..
విచారణ చేయిస్తాం..అదనపు కలెక్టర్ అంకిత్..
మున్సిపాలిటీలో గల రెవెన్యూ విభాగంలో పనిచేసే జూనియర్ అసిస్టెంట్ పై ఆరోపణలు వచ్చినందున విచారణ జరిపిస్తామని అదనపు కలెక్టర్ అంకిత్ అన్నారు. పట్టణంలోని జిల్లా పరిషత్ రాంమందిర్ పాఠశాలలో అమ్మ ఆదర్శ పాఠశాలను పరిశీలించడానికి వచ్చిన సందర్భంగా ఆయన మాట్లాడారు. విచారణ జరిపి నివేదికను పంపించాలని మున్సిపల్ కమిషనర్ రాజును ఆదేశించారు. కమిషనర్ నివేదిక తర్వాత చర్యలు చేపడతామని ఆయన అన్నారు.