ఆదర్శ ప్రిన్సిపాల్ మన్నెదీనా సంగారెడ్డికి బదిలీ

Adarsh ​​Principal transferred to Mannedina Sangareddy– నూతన ప్రిన్సిపాల్ రాజ్ కుమార్ 

నవతెలంగాణ – ధర్మారం
మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాల, కళాశాల మున్సిపల్ మన్నెదీనా సంగారెడ్డికి బదిలీ అయ్యారు. రాజ్ కుమార్ పదవీ బాధ్యతలు స్వీకరించారు ఈ సందర్భంగా పాఠశాల ఇబ్బంది ఉపాధ్యాయులు విద్యార్థుల తల్లిదండ్రులు ప్రిన్సిపాల్ బదిలీపై పాఠశాలను పగిలిపోవడం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. 2013 లో ప్రభుత్వం ప్రారంభించగా ఆదర్శ పాఠశాల ప్రారంభం అయిన నుండి ఇప్పటివరకు మన్నెదీనా ప్రిన్సిపాల్ గా కొనసాగుతూ ఆదర్శ పాఠశాలను ఉన్నత స్థాయికి తీర్చి గిద్దడంలో ప్రధాన పాత్ర పోషించారని కొనియాడారు, ఉద్యోగులకు బదిలీ తప్పనిసరి అని ఆదర్శ ప్రిన్సిపాల్ గా విద్యార్థులకు ఏ సమస్యలు అడ్డుకాకుండా అభివృద్ధి పథంలో పాఠశాలకు అంకితభావంతో విద్యార్థులను తీర్చిదిద్ది ఆదర్శ విద్యార్థులుగా ప్రోత్సహించారని కొనియాడారు. మీరు బదిలీ అయిన స్థానంలో కూడా ఇలాంటి మంచి పేరు ప్రఖ్యాతులు పొందాలనిఆకాంక్షించారు.