‘ఈవో’ను బదిలీ చేయడం సరైనది కాదు

– మేడారం పూజారుల సంఘం
నవతెలంగాణ- తాడ్వాయి : మేడారం సమ్మక్క- సారలమ్మ వనదేవతల మహా జాతర ఇంకా సుమారు నెల రోజుల వ్యవధిలోనే ఉంది, కాబట్టి మేడారం ఈవో రాజేంద్రం ను బదిలీ చేయాలని వస్తున్నా ఊహాగానాలు సరైంది కాదని శ్రీ సమ్మక్క సారలమ్మ జాతర, మేడారం పూజారుల సంఘం పేర్కొంది. బుధవారం మేడారం ఎండోమెంట్ ఆవరణలో పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్దబోయిన జగ్గారావు ఆధ్వర్యంలో పూజారులు సమావేశం ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్దబోయిన జగ్గారావు మాట్లాడుతూ మేడారం మహా జాతర పట్టుమని నెల రోజుల వ్యవధి ఉందని, ఈ సమయంలో మేడారం ఈవో రాజేంద్రమును బదిలీ చేయాలని వస్తున్నా ఊహగానాలను సరైనది కాదని, దీనిని పూజారుల సంఘం తీవ్రంగా ఖండిస్తుందని తెలిపారు. నూతన ప్రభుత్వం ఏర్పడి, నూతనంగా ఏర్పడ్డ దేవదాయ శాఖ మంత్రి వచ్చి ఇప్పటివరకు మేడారం వనదేవతల దర్శనానికి రాకపోవడం, పూజారుల సమస్యలు తెలుసుకోకపోవడం విడ్డూరంగా ఉందని హెచ్చరించారు. ప్రతిసారి మేడారం మహా జాతరకు సీనియర్లైన ఉన్నతాధికారులను నియమించాలని ప్రభుత్వానికి పదేపదే విన్నవించుకుంటున్న, ప్రభుత్వాలు పట్టించుకోకపోవడంతో, కొత్త అధికారులతో చాలా సమస్యలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి తరుణంలో ఒక సీనియర్ ఎండోమెంట్ అధికారి నీ బదిలీ చేయడం ఇంతవరకు కరెక్ట్ అని తెలిపారు. నూతన ప్రభుత్వంలోని ఎండోమెంట్ శాఖ మంత్రివర్యులు మేడారంలోని సమస్యలు, పూజారులు ఎదుర్కొంటున్న సమస్యలపై సమీక్షా సమావేశం నిర్వహించి, స్థానిక పూజార్ల- భక్తుల సమస్యలపై సమీక్షించాలని పత్రికా పరంగా విజ్ఞప్తి చేస్తున్నట్లు పూజారుల సంఘం ప్రకటించింది. ఈ కార్యక్రమంలో పూజార్లు సిద్దబోయిన మునిందర్, చంద గోపాల్ రావు, కాక సారయ్య, కాక కిరణ్, పెనక సురేందర్, సిద్ధబోయిన మహేష్, సిద్దబోయిన వసంతరావు, పెనక లక్ష్మీనరసు, కుక్కెర పూర్ణచందర్, చంద రఘుపతి, సిద్దబోయిన నితిన్, దెబ్బగట్ల నాగేశ్వరరావు పూజారులు తదితరులు పాల్గొన్నారు.