బదిలీలు ప్రమోషన్లు చేపట్టాలి..

నవతెలంగాణ- కంటేశ్వర్
ఉపాధ్యాయులకు బదిలీలు ప్రమోషన్లు వెంటనే చేపట్టాలని టిపిటిఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు అశోక్ కుమార్ డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం టీఎన్జీవోస్ భవన్లో టిపిటిఎఫ్ జిల్లా కమిటీ సమావేశానికి ఆయన హాజరై ఉపన్యాసించారు. ఈ సమావేశం జిల్లా అధ్యక్షులు వెనిగళ్ళ సురేష్ అధ్యక్షతన జరిగింది. బదిలీలు పదోన్నతులు లేక విద్యారంగం పూర్తిగా నిర్వీర్యమైందని రాష్ట్ర ప్రభుత్వం విద్యను గాలికి వదిలేసిందని ఆయన అన్నారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగిరెడ్డి మాట్లాడుతూ స్కూళ్లలో నైట్ వాచ్మెన్ ,సర్వీస్ పర్సన్స్ లేక ఉపాధ్యాయులే ఆ పని చేసుకోవాల్సి వస్తుందని ఇది సిగ్గుచేటని ఆయన అన్నారు. రాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శి ముత్యాల రవీందర్ మాట్లాడుతూ పిఆర్సి కాలపరిమితి అయిపోయినందున వెంటనే నూతన పిఆర్సి వేయాలనీ తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు మహేందర్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు అరవిందు చందర్, కేసి లింగం మల్కన్నా నగేష్ మల్లేశం గంగా ప్రసాద్ ఇబ్రహీంలు , అలీం, శివ నాగమణి పాల్గొన్నారు.