ఉపాధ్యాయ వృత్తిలో బదలీలు సహజమని మాజీ సర్పంచ్ కండ్లకొయ్య పర్షరాములు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎం. మల్లికార్జున్ అన్నారు. దుబ్బాక మండల పరిధిలోని పద్మనాభుని మండల పరిషత్ ప్రాథమిక ఉన్నత పాఠశాలలో విధులు నిర్వహిస్తూ ఇటీవల జరిగిన బదిలీలలో వివిధ పాఠశాలలకు ఐదుగురు ఉపాధ్యాయులు (విద్యులత, విజయ్ కుమార్, బాల్ రాజ్, అనురాధ, సంజీవ రెడ్డి) ట్రాన్స్ఫర్ కాగా గురువారం వీడ్కోలు సమావేశం నిర్వహించారు. ఈ సంధర్బంగా వారికి విద్యార్థులు, తల్లిదండ్రులు, ప్రజా ప్రతినిధులు, పాఠశాల ఉపాధ్యాయులు శాలువాలు, జ్ఞాపికలు, పూల దండలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా బదిలీ అయిన ఉపాధ్యాయులు తమకు పాఠశాలతో, విద్యార్థులతో, ఉపాధ్యాయులతో, గ్రామస్తులతో ఉన్న అనుబంధాన్ని నెమరు వేసుకున్నారు. ఈ ఉపాధ్యాయులు మాట్లాడుతూ బదిలీలు అనేవి సహజమని కానీ విద్యార్థి, ఉపాధ్యాయుల బంధం శాశ్వతంగా కొనసాగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, యువత తదితరులున్నారు.