ఉద్యోగంలో బదిలీలు తప్పనిసరి ఎంపీపీ గజ్జల సాయిలు

నవతెలంగాణ – మిరు దొడ్డి
ఉద్యోగ జీవితంలో ప్రతి ఉద్యోగికి బదిలీలు తప్పనిసరి అని మిరుదొడ్డి ఎంపీపీ గజ్జల సాయిలు, వైస్ ఎంపీపీ పోలీస్ రాజులు లు  అన్నారు. మిరుదొడ్డి మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో గా బాధ్యతలు నిర్వర్తించి, మిరుదొడ్డి మండలంలోని అందరి మన్ననలు పొందిన ఎంపీడీవో రాజిరెడ్డి బదిలీపై మెదక్ జిల్లాకు వెళ్లడం జరిగిందన్నారు. ఉద్యోగరీత్యా ప్రజలకు తన వంతు సహకారాన్ని అందిస్తూ గ్రామాల్లోని సమస్యల పరిష్కారానికి ఎంపీడీవో రాజిరెడ్డి ఎంతగానో కృషి చేయడం జరిగిందని తెలిపారు. అంకితభావంతో పనిచేసిన రాజిరెడ్డిని ఇక్కడి ప్రజలు ఎప్పటికీ గుర్తుంచుకుంటారని అన్నారు. కష్టమైన పనులను కూడా ఇష్టంగా చేస్తూ అందరి మన్ననలను ఎంపీడీవో రాజిరెడ్డి పొందడం హర్షించదగ్గ విషయం అన్నారు. బదిలీపై వెళ్తున్న రాజిరెడ్డిని శాలువాతో ఎంపీడీవో కార్యాలయం సిబ్బందితో పాటు ప్రజా ప్రతినిధులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో  ఎంపీడీవో గణేష్ రెడ్డి, సూపర్డెంట్ నారాయణ టెక్నికల్ అసిస్టెంట్లు కొండల్ రెడ్డి సుభాష్ మల్లారెడ్డి పంచాయతీ కార్యదర్శులు ఎంపీడీవో ఆఫీస్ సిబ్బంది పలువురు పాల్గొన్నారు.