నవతెలంగాణ – సిరిసిల్ల
తెలంగాణ రాష్ట్రంలోని మల్టీ జోన్-1 లో 10మంది సీఐలను వివిధ ప్రాంతాలకు బదిలీ చేసినట్లు ఐజి జి సుధీర్ బాబు ఉత్తర్వులు జారీ చేశారు. సిరిసిల్ల పట్టణ పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న రఘుపతి ఐజి కార్యాలయానికి ఐజి కార్యాలయంలో పనిచేస్తున్న కస్పరాజు కృష్ణ సిరిసిల్ల పట్టణ పోలీస్ స్టేషన్ కు సిరిసిల్ల రూరల్ పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న సదన్ కుమార్ ఐ జి కార్యాలయం కు ఐ జి కార్యాలయంలో పనిచేస్తున్న మొగిలి సిరిసిల్ల రూరల్ కు బదిలీ అయ్యారు అలాగే ఐ జి కార్యాలయంలో పనిచేస్తున్న నాగపురి శ్రీనివాస్ ఆర్మూర్ పోలీస్ స్టేషన్ కు వి రవికుమార్ ఆర్మూర్ పోలీస్ స్టేషన్ నుంచి ఐ జి కార్యాలయం కు ఆరిఫ్ అలీ ఖాన్ ఐజి కార్యాలయం నుంచి జగిత్యాల ఎస్ బి గా బదిలీ అయ్యారు నాగేశ్వరరావు జగిత్యాల ఎస్ బి గా పనిచేసి ఐజి కార్యాలయంకు బదిలీ అయ్యారు కే జితేందర్ అశ్వరావుపేట నుంచి ఐ జి కార్యాలయంకు డి గురు స్వామి సిద్దిపేట సిసిఆర్బి నుంచి వరంగల్ కమిషనరేట్కు అటాచ్డ్ గా బదిలీ చేసినట్లు ఐజి సుధీర్ బాబు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.