ఐఏఎస్‌ల బదిలీలు

IAS .imgనవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
రాష్ట్రంలో పలువురు ఐఏఎస్‌ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (జీహెచ్‌ఎంసీ) కమిషనర్‌గా పనిచేస్తున్న లోకేష్‌కుమార్‌ను చీఫ్‌ ఎలక్షన్‌ ఆఫీసర్‌ (సీఈఓ) కార్యాలయంలో అడిషనల్‌ చీఫ్‌ ఎలక్ట్రోరల్‌ ఆఫీసర్‌గా నియమించారు. ఆర్థికశాఖ కార్యదర్శిగా పనిచేస్తున్న డీ రొనాల్డ్‌రాస్‌ను జీహెచ్‌ఎంసీ కమిషనర్‌గా నియమించారు. ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ శాఖ డైరెక్టర్‌గా పనిచేస్తున్న సర్ఫరాజ్‌ అహ్మద్‌ను కూడా సీఈఓ కార్యాలయంలో జాయింట్‌ చీఫ్‌ ఎలక్ట్రోరల్‌ ఆఫీసర్‌గా నియమించారు. వెయిటింగ్‌లో ఉన్న మహ్మద్‌ ముషార్రఫ్‌ అలీ ఫారూఖీని ఎక్సైజ్‌ అండ్‌ ప్రొహిబిషన్‌ శాఖ డైరెక్టర్‌గా నియమించారు.