నవతెలంగాణ – కంటేశ్వర్
తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎమ్మార్వోల బదిలీలకు శ్రీకారం చుట్టారు. అందులో భాగంగా నిజామాబాద్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో తహసీల్దారులను శనివారం బదిలీ చేస్తూ ఉత్తర్వులను తెలంగాణ రాష్ట్ర చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ అధికారి నవీన్ మిట్టల్ ఆదేశాలను జారీ చేశారు. ఇందులో భాగంగా నిజామాబాద్ జిల్లాకు చెందిన ఎమ్మార్వోల తో పాటు కామారెడ్డి జిల్లాకు చెందిన ఎమ్మార్వోలు బదిలీ అయ్యారు. వారి స్థానంలో నిజామాబాద్ జిల్లా జోన్ రెండు కావడంతో జగిత్యాల్, నిర్మల్, మంచిర్యాల్, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, భద్రాద్రి, కొత్తగూడెం, పెద్దపల్లి, తదితర జిల్లాల నుండి నిజామాబాద్ కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఎమ్మార్వోఅధికారులు వస్తున్నారు అని బదిలీలలో పేర్కొన్నారు.