నవతెలంగాణ – భువనగిరి
పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తూన్న జిల్లాలో పని చేస్తున్న పలువురు డిప్యూటీ కలెక్టర్ స్థాయి అధికారులు, తహాసిల్దార్ స్థాయి అధికారులు బదిలీ చేస్తూ శనివారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. భారత ఎన్నికల సూచనలు మేరకు వారికి బదిలీ చేసి వారికి పోస్టింగ్ ఇస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. చౌటుప్పుల్ ఆర్డీవోగా పని చేస్తున్న జగన్నద్‌రావు, జిల్లా కలెక్టరేట్‌కు బదిలీ అయ్యారు. ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న నాగలక్ష్మి జహిరాబాద్ డిప్యూటీ కలెక్టర్‌గా జిల్లా కలెక్టరేట్‌లో భూ సేకరణ విభాగంలో విధులు నిర్వహిస్తున్న శేఖర్‌రెడ్డి చౌటుప్పుల్ ఆర్డీవగా బదిలీ చేశారు. సీసీఎల్‌ఏలో పని చేస్తున్న జయశ్రీ జిల్లా కలెక్టర్ కార్యాలయంకు బదిలీ చేశారు.
తహాసిల్దార్లు బదిలీలు…
– ఆత్మకూర్(ఎం) తహాసిల్దార్ ఏ. అండాలు జిల్లా కలెక్టరేట్‌కు బదిలీ అయ్యారు.
– పోచంపల్లి తహాసిల్దార్ బి.వీరాబాయి, రంగారెడ్డికి బదిలీ అయ్యారు.
– కలెక్టరేట్ సూపర్‌డెంట్ గీరిధర్, రంగారెడ్డి జిల్లాకు బదిలీ అయ్యారు.
– రంగారెడ్డిజిల్లాలో పని చేస్తున్న శ్రీకాంత్‌రెడ్డి యాదాద్రిభువనగిరి జిల్లాకు వచ్చారు.
– సంగారెడ్డిలో విధులు నిర్వహిస్తున్న రవికుమార్ యాదాద్రిభువనగిరికి జిల్లాకు వచ్చారు.
– నాగర్‌కర్నల్ జిల్లాలో విధులు నిర్వహిస్తున్న జి సైదులు యాదాద్రిభువనగిరి జిల్లా కు వచ్చారు.