ఉపాధ్యాయుల బదిలీలను ప్రత్యక్ష మాన్యువల్‌ పద్ధతిలో నిర్వహించాలి

– పీఆర్‌టీయూటీఎస్‌ జిల్లా అధ్యక్షులు
కన్నయ్య, గోవర్ధన్‌ యాదవ్‌
నవతెలంగాణ-తలకొండపల్లి
మండల కేంద్రంలో ఎస్‌జిటి ఉపాధ్యాయుల బదిలీలను ప్రత్యక్ష మాన్యువల్‌ పద్ధతిలో నిర్వహించాలని పిఆర్‌టియుటిఎస్‌ రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు కన్నయ్య, గోవర్ధన్‌ యాదవ్‌ అన్నారు. గురువారం తలకొండపల్లి మండల కేంద్రంలో సభ్యత్వ నమోదు వారోత్సవాలు ముగింపు సందర్భంగా జిల్లా పరిషత్‌ పాఠశాల తలకొండపల్లిలో, జడ్పీహెచ్‌ఎస్‌ పడకల్‌ కేజీబీవీ తలకొండపల్లి పాఠశాలలో సభ్యత నమోదు వారోత్సవాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పీఆర్‌టీయూటీఎస్‌ రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు కన్నయ్య, గోవర్దన్‌ యాదవ్‌ మాట్లాడుతూ ఎస్‌జీటీలు 2435 ఉపాధ్యాయులు బదిలీలకు దరఖాస్తు చేసుకున్నారు. ఎస్‌జీటీలకు ఆప్‌లైన్‌ విధానంలోనే కౌన్సిలంగ్‌ నిర్వహించాలని, లేదంటే దశలవారిగా నిర్వహించాలని తెలిపారు. కార్యక్రమంలో మండల శాఖ అధ్యక్షులు భగవాన్‌ రెడ్డి, ప్రధాన కార్యదర్శి అరవింద్‌ కుమార్‌, మండల కార్యదర్శి కవిత, వెంకటయ్య, ముత్తయ్య, భూపతి నాయక్‌, మాజీ నాగర్‌ కర్నూల్‌ మండలాధ్యక్షులు బాలిశ్వర్‌ తదితరులు పాల్గొన్నారు.