ఉపాధ్యాయుల బదిలీలు చేపట్టాలి

–  ఉప ముఖ్యమంత్రికి బీటీఏ వినతి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులను చేపట్టాలని బీటీఏ అధ్యక్షులు కల్పదర్శి చైతన్య రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కను బుధవారం హైదరాబాద్‌లో ఆయన కలిసి వినతిపత్రం సమర్పించారు. ఎస్సీ,ఎస్టీలకు గొడ్డలిపెట్టుగా ఉన్న అడిక్వసీ జీవో నెంబర్‌ రెండును రద్దు చేసి కొత్త జీవోను తేవాలని సూచించారు. ఉపాధ్యాయుల పెండింగ్‌ బిల్లులను చెల్లించాలనీ, డీఏలు విడుదల చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీటీఏ రాష్ట్ర సలహాదారులు మధుకర్‌, ఎన్‌ యాదయ్య, నాయకులు కావలి రమేష్‌ తదితరులు పాల్గొన్నారు.