
రామగిరి మండలంలోనీ ట్రాన్స్ పార్మర్ల లోని విలువైన కాపర్ వైర్, ఆయిల్ అపహరించే దుండగులు రెచ్చిపోతున్నారు. పొలాల్లో ట్రాన్స్ఫార్మర్లను ధ్వంసం చేస్తూ, అందులో ఉన్న కాపర్, ఆయిల్ ను దొంగలిస్తున్నారు. రైతులు నార్లు పోసుకుని పంటలు సాగు చేస్తున్న సమయంలో ట్రాన్స్ పార్మర్లు చోరీకి గురవుతుండడంతో ఆయా గ్రామాల రైతులు ఆందోళన చెందుతున్నారు. మంగళవారం రామగిరి మండలంలోని బేగంపేట శివారులోని రాంపెల్లి చిన్నయ్య అనే రైతు పొలంలో 25 కేవీఏ హెచ్ పి ట్రాన్స్ఫార్మర్ ను దొంగలించి దుండగులు దానిలో ఉన్న విలువైన కాపర్, ఆయిల్ వస్తువులను దొంగలించినట్లు గుర్తించిన రైతు లైన్ మెన్ రమేష్ ధ్వారా విద్యుత్ అధికారులకు తెలియజేశాడు. వ్యవసాయ పొలంలో ట్రాన్స్ఫార్ మర్ ను అమర్చడానికి దాదాపుగా రెండు నుంచి మూడు లక్షల ఖర్చు అవుతుందని, ఈ దొంగతనాలతో రైతులు భారీ నష్టపోతున్నారని, గ్రామ రైతుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వరుస దొంగతనాలతో రైతులు తీవ్రంగా నష్ట పోతున్నారని, గతంలోనూ ఇదే విధంగా చోరీలు జరిగినా, ఇప్పటి వరకు నిందుతులను పట్టు కోలేదని రైతులు అంటున్నారు. ఇలాంటి చోరీలతో తాము వ్యవసాయం చేయడం కష్టతరంగా మారిందని, లక్షల రూపాయలు ఖర్చు చేసుకొని ఏర్పాటు చేసిన ట్రాన్స్ఫార్లు చోరికి గురవుతుండడంతో పంటలకు నీళ్లు ఎండిపోయే పరిస్థితి ఏర్పడుతుందని, ఇప్పటికైనా నిఘాను పెంచి చోరీలను నివారించాలని రైతులు కోరుతున్నారు.