– తాసిల్దార్ ఎండి ముజీబ్
నవతెలంగాణ – మద్నూర్
రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు అందించనున్న రైతు భరోసా రేషన్ కార్డులు ఇందిరమ్మ ఇల్లు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాల ఎంపిక సర్వేలో అధికారులు పారదర్శకంగా చేపట్టడం జరిగిందని, మండల తాసిల్దార్ పెద్ద షక్కర్గా గ్రామ పంచాయతీ ప్రత్యేక అధికారి ఎండి ముజీబ్ తెలిపారు. పెద్ద షక్కర్గా గ్రామంలో గ్రామ పంచాయతీ ప్రత్యేక అధికారి అధ్యక్షతన గ్రామసభ జరిగింది. ఈ సందర్భంగా తాసిల్దార్ మాట్లాడుతూ.. పంచాయతీ పరిధిలో ప్రభుత్వ పథకాల అమలు కోసం లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా చేపట్టడం జరిగిందని గ్రామస్తులకు తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు ఆ గ్రామ పెద్దలు కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు రామ్ పటేల్ గ్రామస్తులు పాల్గొన్నారు.