పారదర్శకంగా సహయమందజేత ..

Transparent support..– సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీలో ఎమ్మెల్యే కవ్వంపల్లి..
నవతెలంగాణ – బెజ్జంకి 
గత ప్రభుత్వం సీఎం రీలీఫ్ ఫండ్ పంపిణీలో అక్రమాలకూ తావించిందని..కాంగ్రెస్ ప్రభుత్వం ఆన్ లైన్ ద్వార దరఖాస్తులు స్వీకరించి పారదర్శకంగా సీఎం రిలీఫ్ ఫండ్ సహయమందజేస్తుందని ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు.సోమవారం మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో మండలంలోని అయా గ్రామాల లబ్ధిదారులకు సోమవారం ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ అధికారులతో కలిసి రూ.6.6 లక్షల సీఎం రీలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేశారు.అంతకుముందు ముత్తన్నపేట గ్రామంలో ఓవర్ హెడ్ ట్యాంక్ నిర్మాణానికి శంకుస్థాపన చేసి మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాలలో నిర్మించిన నూతన వంట గదిని ప్రారంభించారు.అనంతరం వనమహోత్సవంలో ఆదర్శ విద్యాలయ సిబ్బందితో కలిసి మొక్కను నాటారు.మండల ప్రత్యేకాధికారి మల్లేశం, తహసిల్దార్ శ్రీనివాస్ రెడ్డి,ఎంపీడీఓ లక్ష్మప్ప, సూపరిండెంట్ అంజయ్య,బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఒగ్గు దామోదర్,మండలాధ్యక్షుడు ముక్కీస రత్నాకర్ రెడ్డి,మండల మహిళాధ్యక్షురాలు కనగండ్ల జ్యోతి, పులి క్రిష్ణ,పోతిరెడ్డి మధు సూదన్ రెడ్డి,మాజీ సర్పంచ్ ద్యావనపల్లి శ్రీనివాస్,అయా గ్రామాల కాంగ్రెస్ నాయకులు,కార్యకర్తలు,లబ్ధిదారులు పాల్గొన్నారు.
మురుగు నీరును తక్షణమే తరలించాలి: ఎమ్మెల్యే
మండల కేంద్రంలో జననవాసాల మద్య నిల్వ ఉన్న మురుగు నీరును తరలించేల ఏర్పాట్లు పూర్తి చేసి చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే తహసిల్దార్, ఎంపీడీఓను అధేశించారు.ప్రభుత్వ భూమిని అక్రమించిన వారిపై తక్షణమే చట్టపరమైన చర్యలకు ఉపేక్షించవద్దని అధికారులను హెచ్చరించారు.