అతివేగం,హెల్మెట్ లేని ప్రయాణం ప్రమాదకరం : సి.ఐ బిసన్న

నవతెలంగాణ:నాగార్జునసాగర్ : అతివేగం, అవగాహన లేని డ్రైవింగ్ కారణంగా విలువైన ప్రాణాలను కోల్పోతున్నారని నాగార్జునసాగర్ సర్కిల్ సిఐ బిసన్న అన్నారు. రోడ్డు భధ్రత వారోత్సవాలలో భాగంగా బుధవారం నందికొండ మున్సిపాలిటీ పరిధిలోని హిల్ కాలనీ నుంచి పైలాన్ బస్టాండ్ వరకు బైక్‌ ర్యాలీ నిర్వహించారు.అనంతరం మాట్లాడుతూ అదుపు చేయలేని వేగం, అవగాహన లేని డ్రైవింగ్ కారణంగా నిండు ప్రాణం బలైపోతుందని, వాహనదారులు ప్రయాణికులను సురక్షితంగా వారి గమ్యానికి చేర్చాలని అన్నారు.ద్విచక్ర వాహనదారులు ప్రయాణం చేసేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, హెల్మెట్ ధరించేది పోలీసు వారి కోసం కాదని ప్రతి ఒక్కరు గుర్తించాలని , తమ ప్రాణాలకు రక్షణ కోసమే హెల్మెట్ అని తెలియజేశారు. ట్రాక్టర్లు లారీల డ్రైవర్లు తప్పనిసరిగా లైసెన్స్ కలిగి ఉండాలని, వాహనాలు నడేపేటప్పుడు మద్యం సేవించరాదని అన్నారు. ఇటీవల రోడ్డు ప్రమాదాలు తరచూ జరుగుతున్న నేపథ్యంలో ప్రయాణికులు మద్యం సేవించి నడుపుతున్న వాహనాలలో ప్రయాణించ వద్దని సూచించారు.
విజయపురి నార్త్ ఎస్.ఐ సంపత్ మాట్లాడుతూ…ద్విచక్ర వాహనదారులు హెల్మెట్‌ ధరించి వాహనం నడపాలని, ట్రిపుల్ రైడింగ్‌ చేయరాదని సూచించారు. మద్యం సేవించి, అతి వేగంగా వాహనాలు నడపవద్దన్నారు. నియమాలు ఉల్లం ఘించే వాహనదారులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. హెల్మెట్‌ ధరించకుండా వాహనదారులు ప్రమాదాలకు గురై తరుచుగా మృత్యువాత పడతున్నారని అన్నారు. వాహనానికి సంబంధించిన పత్రాలు వెంట ఉంచుకోవాలని, ట్రిబుల్‌, ర్యాష్‌ డ్రైవింగ్‌ చేయవద్దని సూచించారు.నాగార్జునసాగర్ సర్కిల్ పరిధిలోని పెద్దవూర ,తిరుమలగిరి సాగర్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.