
భిక్కనూరు పట్టణ కేంద్రంలోని పల్లె దావకానాలు బుధవారం పోషకాహార లోపంతో బాధపడుతున్న ఐదు సంవత్సరాలలోపు పిల్లల్ని గుర్తించి ఆర్ బి ఎస్ కే టీం డాక్టర్ మనోజ్ అవసరమైన మందులు, సలహాలు సూచనలు అందజేశారు. పిల్లలకు సరైన సమయంలో పౌష్టికాహారాన్ని అందించాలని, ఆహార నియమాలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో హెచ్ ఈ ఓ వెంకటరమణ, ఐసిడిఎస్ సూపర్వైజర్ శోభ, హెల్త్ సూపర్వైజర్ రాజమణి, ఫార్మసిస్ట్ యాద గౌడ్, ఏఎన్ఎం శ్యామల, అంగన్వాడి టీచర్స్ యాదమ్మ, వీణరాణి, వసంత, సంతోషి, ఆశా వర్కర్లు, తదితరులు పాల్గొన్నారు.