‘మహాలక్ష్మి’పై హైకోర్టులో విచారణ

నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణానికి సంబంధించిన జీవో నెంబర్‌ 47 రద్దు చేయాలని కోరుతూ నాగోలుకు చెందిన హరీందర్‌ హైకోర్టులో పిటీషన్‌ దాఖలు చేశారు. ప్రజా ప్రయోజన వ్యాజ్యంగా ఆయన ఈ కేసును దాఖలు చేశారు. అయితే దీనిలో ప్రజాప్రయోజనం ఏమీ లేదనీ, ఆ పిటీషన్‌ను రిట్‌గా పరిగణిం చాలని న్యాయస్థానం హైకోర్టు రిజిస్ట్రా ర్‌కు సూచించింది. ఉచిత ప్రయాణం వల్ల బస్సుల్లో రద్దీ పెరిగిందనీ, కుటుం బంతో కలిసి వెళ్లినప్పుడు బస్సులో నిల బడే పరిస్థితి కూడా లేదని పిటీషనర్‌ పేర్కొన్నారు. పిటీషనర్‌ ఇబ్బంది ఎదుర్కొని పిల్‌ దాఖలు చేశారనీ, దాన్ని తాము అర్థం చేసుకోగలమని హైకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఈ కేసుపై తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేశారు.