
– ఎంపిపి పాల్త్య విఠల్
నవతెలంగాణ-నసురుల్లాబాద్
తెలంగాణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా ఈనెల 17 నసురుల్లాబాద్ మండలంలో నిర్వహిస్తున్న గిరిజన సంబరాల్లో రాష్ట్ర శాసన సభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి వస్తున్నారని గిరిజన సంబరాలను విజయవంతం చేయాలని నసురుల్లాబాద్ ఎంపిపి పాల్త్య విఠల్, మండల పార్టీ అధ్యక్షుడు పెర్క శ్రీనివాస్ తెలిపారు. ఈ నెల 17 న నస్రుల్లాబాద్ మండల కేంద్రంలో నిర్వహిస్తున్న గిరిజ సంబరాల్లో స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి రాక సందర్భంగా నేడు నసురుల్లాబాద్ గిరిజన గురుకుల పాఠశాల ఆవరణ స్థలం ను మండల ప్రజాప్రతినిధులతో కలిసి సభ స్థలంను పరిశీలన చేశారు. నసురుల్లాబాద్ మండలంలోని అన్ని గిరిజన గ్రామాల గిరిజనులు సభకు తరలి వచ్చేలా చూడాలని, ఇంటింటికీ వెళ్లి కలిసి ప్రభుత్వం అందిస్తున్న పథకాలను వివరించి అందరినీ సభకు వచ్చేలా కృషి చేసి సభ ను విజయవంతం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంక్షేమ పాఠశాల అధికారులు, ఎంపిడిఓ సుబ్రహ్మణ్యం నసురుల్లబాద్ మండల బిఆర్ఎస్ నాయకులు తదితరులు ఉన్నారు.