గిరిజన బందు తక్షణమే అమలు చేయాలి 

గిరిజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు భీమా సాహెబ్ 
నవతెలంగాణ -హుస్నాబాద్ రూరల్ 
రాష్ట్ర ప్రభుత్వం గిరిజన బంద్ పథకాన్ని తక్షణమే అమలు చేయాలని తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు భీమా సాహెబ్ అన్నారు.గురువారం హుస్నాబాద్ లో గిరిజన సంఘం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దళిత బంధు, బీసీ బందు, మైనార్టీ బందు అమలు చేస్తున్న ప్రభుత్వం గిరిజన్లపై  వివక్ష చూపుతున్నారని అన్నారు. గత ఏడాది సెప్టెంబర్ 17న సీఎం కేసీఆర్  ప్రకటించి పది నెలలు గడుస్తున్నా అమలు కావడం లేదన్నారు. మరో రెండు నెలల్లో అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ వస్తున్న నేపథ్యంలో గిరిజన బందు ఎప్పుడు అమలుచేస్తారో ప్రభుత్వం ఇవ్వాలని డిమాండ్ చేశారు. గిరిజన మంత్రి,ఎంపీ, ఎం ఎల్ ఏ లకు చిత్తశుద్ధి ఉంటే ముఖ్యమంత్రి కేసీఆర్ పై వోత్తిడి చేసి ఇవ్వాలన్నారు. దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నవారందరికీ వర్తింప చేయాలని డిమాండ్ చేశారు. గిరిజన బందు సాధన కోసం గిరిజనులు,విద్యార్థి,ఉద్యోగ సంఘాలు,మేధావులు కలిసి రావాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం రాష్ట్ర నాయకులు శివరాజ్, జిల్లా కార్యదర్శి బానోత్ వెంకటేష్ నాయక్, యాదగిరి నాయక్ రవి నాయక్ బాలు నాయక్ రమేష్ నాయక్ రాజు నాయక్ తదితరులు పాల్గొన్నారు.