అనారోగ్యంతో గిరిజన బాలిక మృతి

Khammam,Navatelangana,Telugu News,Telangana.నవతెలంగాణ-ఆళ్ళపల్లి
అనారోగ్యంతో ఓ గిరిజన బాలిక మృతి చెందిన ఘటన మండలంలో శుక్రవారం చోటు చేసుకుంది. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. అనంతోగు గ్రామానికి చెందిన వూకె రాంబాబు-లలిత దంపతుల చిన్న కుమార్తె వూకె అక్షిత (16) ఏడాది కాలంగా రక్త పరీక్షల్లో తేలని చర్మ వ్యాధితో బాధపడుతుంది. కుటుంబ సభ్యులు మెరుగైన వైద్యం కోసం స్థానిక, జిల్లా కేంద్రం, పట్టణ ఆసుపత్రుల్లో పలుమార్లు వైద్యం చేయించినా ఫలితం లేకుండా పోయింది. మరో దఫా గత కొన్ని రోజుల క్రితం కుటుంబ సభ్యులు అక్షితను ఖమ్మం మెట్రో ఆసుపత్రిలో చేర్చి, వైద్యం అందిస్తున్నారు. అక్కడె శుక్రవారం ఆరోగ్య పరిస్తితి విషమించడంతో బాలిక మృతి చెందినట్టు వైద్యులు తెలిపారన్నారు. దాంతో అక్షిత తల్లిదండ్రులు, అక్క ఆస్విత, సమీప బంధువులు కన్నీటి పర్యంతం అయ్యారు. అందరినీ ఆప్యాయంగా పలకరించి మాట్లాడే అక్షిత మరణవార్త విని అనంతోగు గ్రామంలో విశాద ఛాయలు అలుముకున్నాయి.