నూతన ఎస్ఐ ని సన్మానించిన గిరిజన నాయకులు

నవతెలంగాణ – మహాముత్తారం 
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహా ముత్తారం మండలానికి నూతనంగా వచ్చిన ఎస్సై మహేందర్ కుమార్ యాదవ్ ను సన్మానించిన గిరిజన నాయకులు. శనివారం మర్యాదపూర్వకంగా కలిసి ఆయనను ఘనంగా సత్కరించి  శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో  జిల్లా గిరిజన నాయకులు రూబీన్ నాయక్, దేవ్ సింగ్ నాయక్, తదితరులు పాల్గొన్నారు.