త్రాగు నీటి కొసం గిరిజన ప్రజలు ఇక్కట్లు 

నవతెలంగాణ – వీర్నపల్లి 
అసలే వేసవి కాలం .. ఎండల తీవ్రత కూడా పెరుగుతుంది.. పెరుగుతున్న ఎండలతో నీటి అవసరాలు కూడా పెరిగాయి. ఒక పక్క గత ప్రభుత్వం మిషన్ భగీరథ క్రింద కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఇంటింటికీ నల్లా ద్వారా నీరు అందించమని గొప్పల తప్ప దాని అమలు మాత్రం క్రింది స్థాయిలో అబాసుపాలు అవుతుంది. గత కొన్ని రోజులుగా వీర్నపల్లి మండలం బంజేరు గ్రామం బీరప్ప తండాలో త్రాగు నీరు రాకపోవడంతో గిరిజనులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. తమ ఇబ్బందులు గ్రామ పంచాయతీ అధికారులకు చెప్పినా ఎలాంటి పరిష్కారం చేయకపోవడం వల్ల ఆ తీవ్ర నీటి ఎద్దడి ఎదుర్కొంటుంది. ఉన్న రెండు బోరు బావులలో ఒక్క బోరు బావిలో చుక్క నిరు లేదు, మరో బోరు బావిలో ఉన్న కొద్ది నీరు అడుగున చేరడంతో త్రాగు నీరు లేక ఇబ్బందుల పడుతున్నాం నల్ల నీరు మూడు రోజులు ఒక్కసారిగా కూడ సరిగ్గ రావు వచ్చిన నీరు బురద నీరు త్రాగడానికి పనికి రావడం లేదు నాలుగు బకెట్ తప్ప నీళ్లు రాక పంటల పొలాల నుంచీ త్రాగు నీరు తెచ్చుకుంటున్నాం పొలాల గట్ల మీద వెళ్ళితే గట్టు మీద నుంచీ జారీ పడుతున్నాం, పొలాల నుంచి నీళ్లు తెస్తే మా పొలాల కు నీరు అందడం లేదు కరెంట్ కూడ సరిగ్గ ఉండటం లేదు రైతులు అంటున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఉన్న అట్ట అడుగు చేరిన బోరు బావి లో లోతులోకి బోరు మోటార్ దింపి త్రాగు నీరు అందించి శాశ్వత పరిష్కారం చూపాలని గిరిజన ప్రజలు కొడుతున్నారు.