గిరిజన గురుకుల ఉపాధ్యాయులు నల్ల బ్యాడ్జీలతో నిరసన

– కార్యచరణ ప్రకటించిన ఉపాధ్యాయులు
– సమస్యలు పరిష్కరించాలని 13 న ప్రజాభవన్ కు పయనం
నవతెలంగాణ – పెద్దవూర
నల్గొండ జిల్లా నాగారర్జున సాగర్ నియోజకవర్గం పెద్దవూర మండల కేంద్రం లోని గిరిజన బాలుర గురుకుల ఉపాధ్యాయులు తమ సమస్యలను పరిష్కరించాలని సోమవారం నల్ల బ్యాడ్జిలతో నిరసన తెలిపారు. ఇందులో భాగంగా  తెలంగాణ రాష్ట్ర గిరిజన రెసిడెన్షియల్ విద్యా సంస్థల ఉపాధ్యాయ సంఘం అధ్యక్షులు యం. ఉపేందర్  తమ జేఏసీ కార్యాచరణను ప్రకటించి మాట్లాడారు. ఈ నెల 12 న  ఉపాధ్యాయులు తమ విధులలో పాల్గొంటూనే నల్ల బ్రాడ్జీలు ధరించి నిరసనను తెలియచేజెస్తున్నామని అన్నారు.13న, ఉపాధ్యాయులు సామూహిక సెలవులు పెట్టి తమకు జరిగిన, జరుగుతున్న అన్యాయాన్ని ప్రజాభవన్ కు వెళ్లి వినతిపత్రం అందజేస్తున్నట్లు తెలిపారు. 317  ట్రాన్స్ఫర్ మరియు ప్రమోషన్స్ లు ఇచ్చిన తర్వాతనే ట్రిబ్ ద్వారా రిక్రూట్మెంట్ అయిన వారికి నియామక పత్రాలు నివేదించడం చేయాలని కోరారు. ఈ నెల12 న తలపెట్టిన కార్యక్రమం  పాఠశాలల్లో, కళాశాలలో అమలు చేశామని అన్నారు. తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే  పరిష్కరించ గలదనే నమ్మకంతో, ఆశతో ఎదురు చూస్తున్నామని తెలిపారు. లేనియెడల మా న్యాయమైన డిమాండ్ల సాధన కొరకు విధులను బహిష్కరించడం తప్ప మరో మార్గం లేదని అన్నారు.తదుపరి కార్యాచరణ ను ఈ నెల 14 ప్రకటిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ లక్ష్మీకాంత్ రెడ్డి, రాష్ట్ర ట్రైటా జాయింట్ సెక్రెటరీ సరిత, నల్లగొండ రీజియన్ కార్యదర్శి  వెంకట్ రెడ్డి,ట్రైటా లోకల్ యూనిట్  కార్యదర్శి  తిరుపతి రెడ్డి, ఉపాధ్యాయులు శ్రీలత,శ్రీధర్ రెడ్డి, మాధవి,కరుణశ్రీ, లక్ష్మీ చైతన్య,వినయ్ కుమార్, లింగారెడ్డి,శీలం రవీందర్ పాల్గొన్నారు.