ఏసీబీకి చిక్కిన ట్రైబల్‌ వెల్ఫేర్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌

ఏసీబీకి చిక్కిన ట్రైబల్‌ వెల్ఫేర్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌– కాంట్రాక్టర్‌ నుంచి రూ.84వేలు తీసుకుంటూ..
నవతెలంగాణ-మెహిదీపట్నం
ట్రైబల్‌ వెల్ఫేర్‌ కార్యాలయంలో ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌గా పనిచేస్తున్న జగ జ్యోతి ఏసీబీ చేతికి చిక్కారు. హైదరాబాద్‌ మాసబ్‌ ట్యాంక్‌లోని తన కార్యాలయంలో ఓ కాంట్రాక్టర్‌ నుంచి రూ.84 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులకు రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. కాంట్రాక్టర్‌ చేసిన పనులకు బిల్లులు ఎంబీ చేయడానికి ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ జగ జ్యోతి డబ్బులు డిమాండ్‌ చేయడంతో ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. దీంతో ఏసీబీ అధికారులు చెప్పిన విధంగా కాంట్రాక్టర్‌ జగ జ్యోతికి డబ్బులు ఇస్తుండగా పట్టుకుని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అధికారులు ఆమె కార్యాలయంతో పాటు ఇంట్లోనూ సోదాలు నిర్వహించినట్టు తెలిపారు. జగ జ్యోతిని కోర్టులో హాజరుపరుస్తామని అధికారులు తెలిపారు.