– కలెక్టర్ గారూ ఒకసారి పరిశీలించండి
– హాస్టల్లో మెనూ పాటించని వార్డెన్
– సాయంత్రం 6 గంటలకే రాత్రి భోజనం
– రాత్రి 9 గంటలు ఆకలవుతుందంటున్న విద్యార్థులు
– పనిచేయని ప్యాన్లు, వాటర్ ఫీల్టర్లు
– ఇబ్బందులకు గురవుతున్న విద్యార్థులు
– పట్టించుకోని ఉన్నతాధికారులు, పాలకులు
నవతెలంగాణ-తాండూరు
నిరుపేద విద్యార్థుల కోసం కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నామని గొప్పలు చెప్పుకుంటున్న ప్రభుత్వం క్షేత్రస్థాయిలో అందుకు భిన్నంగా ఉంటుంది. వసతి గహాల్లో విద్యార్థులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తున్నామంటున్న ఉన్నతాధికారులు, నాయకుల మాటలు క్షేత్రస్థాయిలో కార్యరూపం దాల్చడం లేదు. ఇందుకు నిదర్శనం తాండూర్ పట్టణ కేంద్రంలో ఉన్న గిరిజన సంక్షేమం బాలుర వసతి గహం సమస్యల్లో కొట్టుమిట్టాడుతుంది. గిరిజన సంక్షేమ బాలుర వసతి గహంలో మూడవ తరగతి నుంచి పదవ తరగతి వరకు 151 మంది విద్యార్థులు వసతి గహంలో ఉంటున్నట్టు లెక్కలు చెబుతున్నాయి. వసతి గహంలో విద్యార్థులకు సరైన సౌకర్యాలు ఏమాత్రం అందడం లేదు. విద్యా ర్థులు వసతి గహంలో గబ్బు వాసనలో కాలం విడదీయాల్సిన దుర్భర పరిస్థితి నెలకొంది. వసతి గహంలో విద్యార్థులకు నీళ్ల చారుతోనే సరిపెడుతున్నారు. అన్నం సరిగా ఉండటం లేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వసతి గహంలో ప్రభుత్వం ప్రకటించిన మెను ప్రకారం విద్యార్థులకు అందించడం లేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మెనూలో విద్యార్థులకు రోజు రాగి జావా ఇవ్వాల్సింది ఉన్న ఒక్కరోజు కూడా ఇప్పటివరకు ఇవ్వలేదని విద్యార్థులు అంటున్నారు. విద్యార్థులకు రోజు ఉదయం 6 గంటలకు రాగి జావా ఇవ్వాలని మెనూలో ఉన్నప్పటికీ ఒకరోజు ఇవ్వడం లేదని విద్యార్థులు చెబుతున్నారు. ప్రభుత్వం ప్రకటించిన మెను ఏ మాత్రం అమలు చేయడం లేదని విద్యార్థులు తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. రోజు సాయంత్రం 6 గంటలకే అన్నం పెడుతున్నారని, 9 గంటలకు మళ్ళీ ఆకలవుతుందని మెనులో ఏడు గంటలకు పెట్టాలని ఉన్న అట్లా పెట్టడం లేదని విద్యార్థులు తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. రాత్రి సమయంలో ఆకలి కావడంతో విద్యార్థులు ఆకలితోనే నిద్రపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. హాస్టల్‌లో విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన వాటర్ ఫిల్టర్, ప్యాన్లు పనిచేయకపోవడంతో తాగునీటి, గాలి కోసం విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. స్థానికంగా ఉండి హాస్టల్ విద్యార్థుల సమస్యలు చూసుకోవాల్సిన వార్డెన్ స్థానికంగా ఉండటం లేదని, దీంతో అక్కడ పనిచేసే వారే ఇష్ట రాజ్యాంగ వ్యవహరిస్తున్నారని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హస్టల్ పరిసరాల్లో గడ్డి ఎక్కువగా రావడంతో విష సర్పాలు వచ్చే అవకాశం ఉందని, ఉన్నతాధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ స్పందించి వాసనలో ఉన్న గిరిజన హాస్టల్‌ను బాగు చేయాలని విద్యార్థులు మొరపెట్టుకుంటున్నారు. తమ హస్టల్‌ను కలెక్టర్ గారు ఒకసారి పరిశీలించాలని విద్యార్థులు కోరుతున్నారు. అదేవిధంగా వార్డెన్ స్థానికంగా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని విద్యార్థులు కోరుతున్నారు.