పిడుగుపాటుతో ఆదివాసి మహిళకు అస్వస్థత 

Tribal woman falls ill due to lightning– ములుగు ఏరియా హాస్పిటల్ కి తరలింపు 
నవతెలంగాణ – తాడ్వాయి 
మండలంలోని బంధాల గ్రామపంచాయతీలో నాని లక్ష్మి (38) పిడుగుపాటుతో తీవ్ర గాయాల పాలై అస్వస్థకు గురయ్యారు. స్థానికులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ములుగు జిల్లా తాడ్వాయి మండలం బంధాల గ్రామపంచాయతీలో నాలి లక్ష్మి అనే ఆదివాసి మహిళా రైతు  రోజు మాదిరిగానే సొమవారం రాత్రి జొన్న చేను కాడికి కాపులాగా నిద్రకు వెళ్లారు. సోమవారం అర్ధరాత్రి వర్షం ఉరుములు మెరుపులతో కురిసింది. చేనులోని మంచే పక్కనే గల ఇప్పచెట్టుపై పిడుగు పడింది. ఆ పిడుగు ప్రభావంతో ఆ ఆదివాసి మహిళ తీవ్ర గాయాలయి అస్వస్థకు గురైంది. అదే రాత్రి ములుగు ఏరియా ప్రభుత్వ హాస్పిటల్ కి తీసుకెళ్లారు. ములుగు ఏరియా హాస్పిటల్ లో ఆమె వైద్యం పొందుతున్నారు. కొద్దిగా ఆరోగ్యం కుదుటపడిందని తెలిసింది.కాగా ఆమెకు ఇద్దరు కుమారులు, భర్త లక్ష్మయ్య లు ఉన్నారు. ఆమెకు మెరుగైన వైద్యం అందించాలని, ఆమే కుటుంబానికి ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించి, అన్ని విధాల ఆదుకోవాలని ఆదివాసి గిరిజన తులం దెబ్బ సంఘాలు కోరుతున్నాయి.