ఐటీడీఏ సేవలను గిరిజనులు సద్వినియోగం చేసుకోవాలి: పీఓ రాహూల్

Tribals should take advantage of ITDA services: PO Rahulనవతెలంగాణ – అశ్వారావుపేట
గిరినుల అభివృద్ధికోసం సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ అందిస్తున్న సేవలను సద్వినియోగం చేసుకోవాలని పీఓ రాహూల్ కోరారు.బాహ్య ప్రపంచానికి దూరంగా కొండ కోనల్లో నివసిస్తున్న కొండరెడ్ల గిరిజనుల సంక్షేమానికి అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తామని ఆయన తెలిపారు. మంగళవారం అశ్వారావుపేట నియోజక వర్గంలోని దమ్మపేట,అశ్వారావుపేట మండలాలలోని కొండ రెడ్ల గిరిజన గ్రామాలలో ఆయన విస్తృతంగా పర్యటించారు. ముందుగా పూసుకుంట గ్రామం లోని కొండరెడ్ల గిరిజన గ్రామాన్ని ఆయన సందర్శించి గ్రామంలో ఉన్న సమస్యలను వారిని అడిగి తెలుసుకున్నారు. 16 లక్షల వ్యయంతో నిర్మించిన కమ్యూనిటీ హాల్ను ఆయన పరిశీలించారు.కమ్యూనిటీ హాలును నిరుపయోగంగా ఉంచకుండా సభలు,సమావేశాలు,విందులు ,వేడుకలు లాంటి కార్యక్రమాల కొరకు వినియోగించుకోవాలని,చదువుకున్న నిరుద్యోగులైన గిరిజన యువతి యువకులకు స్వయం ఉపాధి కోసం వారికి ప్రత్యేకంగా శిక్షణలు అందించి ప్రభుత్వ ప్రైవేటు రంగాలలో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని,అలాగే ఈ గ్రామంలో పశు సంపద ఎక్కువగా ఉన్నందున మినీ పాల డైరీ అలాగే గోబర్ గ్యాస్ ప్లాంట్ కొరకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని,పశువుల నుంచి వచ్చే పేడ గోబర్ గ్యాస్ నిర్వహణకు ఎంత ఉపకరిస్తుంది దాని ద్వారా వచ్చే వ్యర్ధాలు సేంద్రీయ ఎరువుగా వాడుకోవచ్చని ఆయన అన్నారు.
పోడు పట్టా కలిగిన భూములకు ఎంతవరకు కరెంట్ సౌకర్యం అవసరం ఉన్నదో దానికి సంబంధించిన ప్రతిపాదనలు సమర్పించాలని సంబంధిత ఏఈకి ఆదేశించారు. పాడైపోయిన మినరల్ వాటర్ ప్లాంట్ రిపేర్ చేయించాలని,అలాగే రోడ్లు పక్క ఇండ్ల నిర్మాణానికి పూర్తిస్థాయిలో సర్వే చేసి దానికి సంబంధించిన ప్రతిపాదనలు సమర్పించాలని ఈఈ ట్రైబల్ వెల్ఫేర్ కు ఆదేశించారు.అనంతరం అశ్వారావుపేట మండలం గోగులపూడి గ్రామానికి సందర్శించి గ్రామంలోని కొండరెడ్ల గిరిజనులతో వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.15 లక్షల వ్యయంతో నిర్మాణం చేపట్టిన కమ్యూనిటీ హాల్లో బ్యాంబోతో కడాఖండాలు తయారు చేయడం చాలా బాగున్నాయి అని,బ్యాంబోతో కళాఖండాలు శిక్షణ ఎక్కడ తీసుకున్నారు అని కొండ రేట్లు గిరిజనులను అడిగి తెలుసుకుని,జనాలకు మీరు తయారు చేసే కళాఖండాలు ఆకర్షించే విధంగా ఉండాలని మీరు తయారు చేసిన కళాఖండాలకు తప్పనిసరిగా ఐటీడీఏ ద్వారా మార్కెట్ సౌకర్యం కల్పిస్తానని ఆయన వారికి భరోసా ఇచ్చారు. ఇంకా గ్రామంలో ఏమైనా సమస్యలు ఉన్నాయా అని కొందరేడ్ల గిరిజనులను అడిగి పొలాలకు కరెంట్ సౌకర్యం సరిగా లేదని, 38 మంది గిరిజన కుటుంబాలు చాలా కాలం నుంచి జీవిస్తున్నామని కానీ 20 కుటుంబాలకు ఇందిరమ్మ ఇండ్లు కట్టించారు కానీ అవి శిధిలావస్థకు చేరుకున్నాయని, మాకు తప్పనిసరిగా పక్కా ఇండ్లు కట్టించాలని అలాగే పంట పొలాలకు కరెంటు సౌకర్యం కల్పించాలని పిఓ దృష్టికి తీసుకొని రాగా,తప్పనిసరిగా సర్వే చేయించి త్వరితగతిన కరెంటు సౌకర్యము,పక్కా ఇండ్లు కట్టిస్తానని,మీకేమైనా సమస్యలు ఉంటే వెంటనే నా దృష్టికి తీసుకొని రావాలని,  చదువుకున్న యువతీ యువకులు ఖాళీగా ఉండకుండా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి స్వయం ఉపాధితో జీవనోపాధి పెంపొందించుకోవడానికి ఎం ఎస్ ఎం ఈ యూనిట్ ద్వారా సబ్సిడీపై రుణాలు అందిస్తామని, మీకు ఇష్టమైన చిన్న తరహా పరిశ్రమలు నెలకొల్పుకొని మీరు జీవించడమే కాక పదిమందికి ఉపాధి అవకాశాలు కల్పించవచ్చని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో సహాయ ప్రాజెక్టు అధికారి జనరల్ డేవిడ్ రాజ్, ఈ ఈ ట్రైబల్ వెల్ఫేర్ తానాజీ, ఏపీవో పవర్ ఏఈ మునీర్ పాషా,అశ్వారావుపేట,దమ్మపేట తాసిల్దార్ లో, ఎంపీడీవోలు, పంచాయతీ సెక్రెటరీ జ్యోతి మరియు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.