డైరెక్టర్ మారుతి సమర్పకుడిగా విజయపాల్ రెడ్డి అడిదల నిర్మిస్తున్న చిత్రం ‘త్రిబాణధారి బార్భరిక్’. భిన్న పాయింట్‌తో ఈ మూవీని మోహన్ శ్రీవత్స దర్శకత్వం వహిస్తున్నారు. వానర సెల్యూలాయిడ్ బ్యానర్ మీద తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో సత్యరాజ్, వశిష్ట ఎన్ సింహ, సాంచి రారు, ఉదయ భాను, సత్యం రాజేష్, క్రాంతి కిరణ్ తదితరులు ముఖ్యపాత్రధారులు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజ్ చేసిన పోస్టర్లు, మోషన్ పోస్టర్, గ్లింప్స్, టీజర్ అన్నీ కూడా ఆడియెన్స్‌లో ఇంట్రెస్ట్ క్రియేట్ చేశాయి. అలాగే టీజర్‌లోని విజువల్స్, ఆర్‌ఆర్, మేకింగ్ స్టాండర్డ్స్ కూడా నెక్ట్స్ లెవెల్లో ఉన్నాయి.
ఇంఫ్యూజన్ బ్యాండ్ ఇచ్చిన మ్యూజిక్-ఆర్‌ఆర్, కుశేందర్ రమేష్ రెడ్డి కెమెరా వర్క్, మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటింగ్ ప్రత్యేక ఆకర్షణ కానుంది. ప్రస్తుతం ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. త్వరలోనే ఈ చిత్రాన్ని రిలీజ్ చేసేందుకు మేకర్లు ప్లాన్ చేస్తున్నారు.
భిన్న పాయింట్‌తో ‘త్రిబాణధారి బార్భరిక్’
10:35 pm