చౌటుప్పల్ లో ఘనంగా అంబేద్కర్ కు నివాళులు

నవతెలంగాణ చౌటుప్పల్ రూరల్:చౌటుప్పల్ మండలం పంతంగి గ్రామంలో భారతీయ జనతా పార్టీ చౌటుప్పల్ మండల అధ్యక్షులు చినుకని మల్లేష్ యాదవ్ ఆధ్వర్యంలో ఆదివారం భారతరత్న డాక్టర్ భీంరావ్ అంబేద్కర్ 133వ జయంతి సందర్భంగా విగ్రహానికి పూలమాల వేసి నివాళుల ర్పించారు.ఈ సందర్భంగా చినుకని మల్లేష్ యాదవ్ మాట్లాడుతూ సమాజంలో ప్రతి ఒక్కరికి రాజకీయ, ఆర్థిక,సామాజిక రంగాలలో సమన్యాయం ఉండాలని భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారు సూచించిన విధంగా దేశంలో ప్రతి ఒక్కరూ అంబేద్కర్ యొక్క స్ఫూర్తిని తీసుకొని ముందుకు వెళ్లాలని కోరారు.ఈ కార్యక్రమంలో పంతంగి ఎంపీటీసీ బోయ ఇందిరసంజీవ బూత్ అధ్యక్షులు నాటి శివ,తోర్పునూరి దయాకర్,మిర్యాల సంతోష్ బిజెపి నాయకులు పాలకూర్ల జంగయ్య గౌడ్,శాగ చంద్రశేఖర్ రెడ్డి,దిండు భాస్కర్,బాతరాజు వెంకటేష్,మిర్యాల రవి,బండ శేఖర్,అంతటి నరేష్, పల్లె వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు