
ఏపీడీ శ్రీ సంజీవ్ కుమార్ శుక్ర వారం మధ్యాహ్నం హఠాన్మరణం చెందడం జరిగింది . గత 30 సంవత్సరాలుగా ఉమ్మడి నిజామబాద్ జిల్లాలో ఇప్పటివరకు ఎన్నో సేవలు చేయడం జరిగింది. ఆయన మరణం జిల్లాలోని ప్రతి ఒక్కరూ ఆశ్చర్యానికి లోనవ్వడం జరిగింది. ఆయన ఆత్మకు శాంతి కలగాలని, వారి కుటుంబ సభ్యులకు ఆ భగవంతుడు మనోధైర్యాన్ని కలిగించాలని కోరుతూ మంచిప్ప గ్రామంలోని గ్రామపంచాయతీ సిబ్బంది, గ్రామస్తులు అందరూ ఆయనకు శ్రద్ధాంజలి ఘటించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ సిద్ధార్థ మాజీ ఉప సర్పంచ్ జగదీష్ కోఆప్షన్ అజీమ్ మాజీ వార్డు సభ్యులు సాయి రెడ్డి, సంజీవ్, వీడిసి ప్రెసిడెంట్ నరేష్ గ్రామ ప్రజలు పాల్గొనడం జరిగింది.