
యాదాద్రి భువనగిరి జిల్లా కు స్కూల్ గేమ్స్ కార్యదర్శి గా నూతనంగా ఎంపిక కాబడిన బెజ్జం బాలకృష్ణ ని జిల్లా యువజన క్రీడల అదికారి కె. దనంజనేయులు తమ కార్యాలయము లో ఘణంగా శాలువాతో సన్మానిచారు. జిల్లా అదికారి మాట్లాడుతూ.. జిల్లా స్థాయి, రాష్ట్రస్థాయి, జాతీయస్థాయి,, అంతర్జాతీయ స్థాయి లో ఈ జిల్లా కు సంబంధించిన విధ్యార్డులను క్రీడల్లో తర్ఫీదు ఇప్పించుటకు గాను వీరి కృషి చలా అవసరమన్నారు. క్రీడల లో భువనగిరి ని ప్రథమ స్థానం లో ముందుకు నడపాలని క్రీడల పట్ల విధ్యార్థుల్లో ఆసక్తి పెంచాలన్నారు. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ద్వార నిర్వహించే పోటీల్లో విధ్యార్ధులు బాగస్వామ్యం పెంచాలని కోరినారు. ఈ జిల్లాను క్రీడ జిల్లాగా మార్చుటకు తమ వంతు సహకారం అందించాలని ప్రత్యేకంగా కోరినారు. తదుపరి తెలంగాణ రాష్ట్ర క్రీడా పాఠశాలలో నాల్గోవ తరగతి లో ప్రవేశం కొరకు వారి ఆదేశాల ప్రకారం మండల స్థాయి ఎంపికలలో ఎంపికైన బాల/ బాలికలకు ఈనెల 28న తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిదేన్శియల్ స్కూల్ (బాలుర ) భువనగిరి నందు నిర్వహించు కార్యక్రమానికి సంభందించి జిల్లా యువజన మరియు క్రీడల అధికారి కే ధనంజనేయులు , స్కూల్ గేమ్స్ కార్యదర్శి బెజ్జం బాలకృష్ణ తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ (బాలుర ) భువనగిరి ప్రిన్సిపాల్ ని కలిసి గ్రౌండ్ ను సందర్శించి సంతోషం వ్యక్త పరిచినారు.