భగత్ సింగ్,రాజ్ గురు,సుఖ్ దేవ్ లకు ఘన నివాళి

నవతెలంగాణ – హలియా 

అనుముల మండల కేంద్రము హాలియా పట్టణంలోని బస్టాండ్ వద్ద స్వాతంత్ర్య సమర యోధులు, దేశభక్తులు షహీద్ భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్ ల 93 వ వర్థంతి కార్యక్రమాన్ని అనుముల మండల పి ఆర్ టి యు టి ఎస్ ఆధ్వర్యంలో శనివారం నాడు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు ఉపాధ్యాయ నాయకులు భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్ ల చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పి ఆర్ టి యు టి ఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు మందా సైదులు రావు గౌతమ్ మాట్లాడుతూ రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన గొప్ప స్వాతంత్ర్య సమరయోధులు భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్ లు అని వారు బ్రిటిష్ పాలకుల కబంధ హస్తాల నుండి స్వాతంత్ర్యం సాధించేందుకు అలుపెరుగని పోరాటం చేశారని, బ్రిటిష్ పాలకుల దుర్మార్గాలను తిప్పికొట్టేందుకు, దేశ స్వాతంత్య్ర సాధన కోసం తమ జీవితాలను త్యాగం చేసిన ఆదర్శ అగ్రశ్రేణి పోరాట యోధులని,దేశ ప్రజల ఆకాంక్షను నెరవేర్చడానికి ఉరికొయ్యను ముద్దాడి ప్రాణత్యాగాలు చేసిన త్యాగధనులు అని, నేటి యువత కు వారి దేశభక్తి, పోరాట పటిమ స్ఫూర్తిదాయకం అని వారి త్యాగాలు దేశ ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచాయని అన్నారు.ఇంకా ఈకార్యక్రమంలో అనుముల మండల పి ఆర్ టి యు టి ఎస్ ప్రధాన కార్యదర్శి మంచికంటి మధు, జిల్లా అసోసియేట్ అధ్యక్షులు మేదరి దేవేందర్, జిల్లా నాయకులు కన్మంతరెడ్డి జైపాల్ రెడ్డి, తిరుమలగిరి సాగర్ మండల అధ్యక్షులు మొక్క పరుశ్ రామ్ గౌడ్, పెద్దవూర మండల ప్రధాన కార్యదర్శి నరందాస్ దుర్గా ప్రసాద్, డాక్టర్ కత్తి కోటిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.