నవతెలంగాణ – యాదగిరిగుట్ట రూరల్
యాదగిరిగుట్ట మండలం మల్లాపురం, గత నెల 29 నుండి ఐదు రోజులపాటు క్షేత్రస్థాయిలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అధ్యాయనం చేసిన సెంట్రల్ గవర్నమెంట్ ఏ ఎస్ ఓ బృందానికి మాజీ ఎంపిటిసి విజయ వీరయ్య, అధికారులు సన్మానం చేశారు. ఏ ఎస్ ఓ బృందం వారు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా అమలు చేయబడుతున్న పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు సంబంధించి ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, అంగన్వాడీలు, గ్రామపంచాయతీ కార్యాలయాలు, వైద్య సేవలు, పనితీరుపై అధ్యయన అనుభవాలను బృందం సభ్యులు తెలిపారు. గ్రామస్థాయిలో మొక్కల పెంపకం, పచ్చదనం, గ్రామ పంచాయతీల నిర్వహణ, ప్రతి గ్రామంలో ట్రాక్టర్ ట్రాలీల ద్వారా ఇంటింటా తడి పొడి చెత్త సేకరణ, డంపింగ్ యార్డులు, కంపోస్ట్ షెడ్లు నిర్వహణ, వైకుంఠధామాలు బాగున్నాయని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఆసరా పెన్షన్లు అందుతున్నాయని తెలిపారు. స్వయం సహాయక సంఘాల మహిళలతో సమావేశాలు కావడం జరిగిందని, ఉపాధి హామీ పనులు, కూలీల చెల్లింపులు బాగున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికారులు తదితరులు పాల్గొన్నారు.