కామ్రేడ్ బుద్ధదేవ్ పట్టాచార్యకు ఘన నివాళి

నవతెలంగాణ – కంటేశ్వర్ 

సిపిఎం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులుగా, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రిగా 11 సంవత్సరాలపాటు సేవలందించిన మహనీయుడు కామ్రేడ్ బుద్దదేవ్ బట్టాచార్య అని గురువారం ఉదయం అకాల మరణం చెందారు. ఆయన గత కొంతకాలంగా అనారోగ్యంతో చికిత్స పొందుతున్నారు.  ఆయన స్వగృహంలో తుది శ్వాస విడిచి భౌతికంగా దేశానికి, పార్టీకి దూరమైనా మా హృదయాలలోనే ఉన్నారని పెద్ది వెంకట్రాములు సిపియం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు అన్నారు. ప్రస్తుతం దేశాన్ని పట్టిపీడిస్తున్న మతోన్మాద బీజేపీ విధానాలని, మతోన్మాద, కులం, మత విధానాలని వ్యతిరేకిస్తూ అనేక పోరాటాలు ప్రత్యక్షంగా పరోక్షంగా చేసిన గొప్ప వ్యక్తి, లౌకికవాది, కమ్యూనిస్టు బుద్దదేవ్ బట్టాచార్య. ఆయన గతంలో రైతాంగ పోరాటం లో పాల్గొని దేశంలో ఎక్కడ లేని విధంగా పశ్చిమ బెంగాల్లో 12. 1/2 లక్షల ఎకరాలు పంచి నిరుపేదలని రైతులని చేసిన ఘనత పశ్చిమ బెంగాల్ సిపిఎం పార్టీ ప్రభుత్వానికి దక్కింది. అందులో బుద్ధదేవ్ బట్టాచర్య ప్రధాన పాత్ర పోషించారని కొనుయాడరు. జ్యోతిబసు తర్వాత పశ్చిమబెంగాల్ రాష్ట్రాన్ని సీఎం గా పాలించడమే కాకుండా సిపిఎం పార్టీని బలోపేతం చేస్తూ కాపాడుతూ వచ్చిన మహనీయుడు అని పెద్ది వెంకట్రాములు కొనియాడారు. ఆయనకు చిత్రపటానికి పెద్ది వెంకట్రాములు-నూర్ఘజహాన్ పూలమాల వేసి నివాళి అర్పించడం జరిగింది. ఆయన ఆశయ సాధనే ఆయనకు గొప్ప నివాళి అని అన్నారు. ఆయన ఆశయ సాధన కోసం సిపిఎం పార్టీ శ్రేణులు అందరూ మరియు కామ్రేడ్ లందరూ కట్టుబడి ఉండాలని, దేశంలో మతోన్మాద ప్యాసిస్టు ప్రమాదాన్ని వ్యతిరేకిస్తూ దేశాన్ని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యురాలు నూర్జహాన్, జిల్లా కమిటీ సభ్యులు విగ్నేష్, నాయకులు కార్యకర్తలు కటారి రాములు, ఎస్ సాయ గౌడ్, బి రాజు తదితరులు పాల్గొన్నారు.