ఏర్గట్ల మండలకేంద్రంలో గురువారం కాంగ్రెస్ పార్టీ మండల సమావేశం జరిగింది.ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సోమ దేవరెడ్డి,డీసీసీ ఉపాధ్యక్షులు శివన్నోళ్ళ శివకుమార్ మాట్లాడుతూ…కమ్మర్ పల్లి మార్కెట్ కమిటీ డైరెక్టర్ గా ఎన్నికైన కొరిపెల్లి లింగారెడ్డిని, యువజన కాంగ్రెస్ మండలాధ్యక్షుడిని, ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన మహమ్మద్ రఫీని,బొల్లాపల్లి సుమన్ గౌడ్ ను,మండల యువజన ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన దండేవోయిన సాయికుమార్ ను, కాంగ్రెస్ పార్టీ తరపున సన్మానించడం జరిగిందని అన్నారు.పార్టీ కోసం కష్టపడ్డ ప్రతి ఒక్కరికి గుర్తింపు ఉంటుందని,ప్రజాపాలన అభివృద్ధి పథకాలను,కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్ళాలని అన్నారు.ఈ కార్యక్రమంలో రాయల్ గాయ్స్ , శివాజీ , రుద్ర సేన, యంగ్ ఫైర్, క్రేజీ బాయ్స్, సహృదయ, ఆదర్శ యూత్ లకు చెందిన సభ్యులు,కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.