ఎస్సి స్టడీ సర్కిల్ డైరెక్టర్ కు సన్మానం

Tribute to Director of SC Study Circleనవతెలంగాణ – ఆదిలాబాద్ టౌన్
ఇటీవల విడుదలైన డీఎస్సీ ఫలితాల్లో అదిలాబాద్ ఎస్సి స్టడీ సర్కిల్ నుండి 26 మంది ఎంపిక కావడం హర్షణీయమని ఆదిలాబాద్ ఎస్సి మోర్చా జిల్లా అధ్యక్షుడు అస్తక్ సుభాష్ అన్నారు. నిరుద్యోగులు ఉద్యోగాలకు ఎంపిక కావడానికి కృషిచేసిన స్టడీ సర్కిల్ డైరెక్టర్ డా.రమేష్ ను గురువారం స్టడీ సర్కిల్ లో శాలువతో సత్కరించి శుభకాంక్షలు తెలిపారు. తొమ్మిది సంవత్సరాల కాలంలో దాదాపు 225 మంది నిరుద్యోగులకు, ఉద్యోగాలు కల్పించడం అభినందనీయమని తెలిపారు. సన్మానించిన వారిలో బొజ్జమహేందర్, గోవర్ధన్ సావాపురే లఖన్ ఉన్నారు.